శ్రీ * గురుభ్యోన్నమః * రచన : రామానుజం. ప. జేబులో : 8500630543 .

 *ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు*
సీస  పద్యం   :
అధ్యాపక  దినోత్స  వానంద   శుభవేళ, 
      గుర్తు చేసికొనుము-గురుల నెపుడు ;
గురువు  రాధాకృష్ణ గుర్తు వచ్చెడి  రోజు , 
      మహనీయు సేవలన్ మరువ లేము ;
విద్యాధికుడు తత్త్వ వేత్త  పండిత శ్రేష్ఠు  , 
           జన్మదినము  నేడు , జాతి కెల్ల  --
పర్వదినము గాన, ప్రతియేట జరుపుతూ
    స్మృత్యంజలి ఘటింతు, స్ఫూర్తి తోడ  ;
తేటగీతి   :
భరత  రాష్ట్రపతి పదవి  ప్రతిభ తోడ  , 
విశ్వ   విద్యాలయాలకు  వీ.సి. గాను --
చేసి ; మాతండ్రి  కందించె  చిత్త మలర , 
దేశ * ఉత్తమోపాధ్యాయ * దివ్య కాన్క  !!
కామెంట్‌లు