ఔ మల్ల!:-- బాలవర్ధిరాజు మల్లారం -871 297 1999

 గీ పోటువల 
నాతోటి కూసున్నది  
సామ నర్సిమ్మ రెడ్డి.
మేమిద్దరం 
ఒకటో తరగతి నుంచి 
పదిహేనో తరగతి దాకా
కలిసే సదువుకున్నం
ఒకటి నుంచి నాలుగు దాకా
మా ఊరు మల్లారం ల సోపాలకు పోయినం,
ఐదు నుంచి పది దాకా
అన్మశ్పటల సదువుకున్నం.
పద కొండు,పన్నెండు ఏములాడల,
పదమూడు నుంచి పది హేను  దాకా కరిమార్ ల  సాడువుకున్నము
అగో  
గప్పటి నుంచి గిప్పటి దాకా 
మా సోపతి
సెక్కు సెదరకుంట ఉన్నదుల్లా!
మా ఇద్దరి ఆలోచనలు
ఏరే లెక్కుంటయ్
మా ఇట్టాలు 
ఏరే తీరుగుంటయ్
ఆయిన గని
మేమిద్దరం 
సిన్నప్పటి నుంచి
కలిసి మెలిసే ఉంటున్నముల్లా!
కలిసి తాగితేనే,
కలిసి తింటేనే 
సోపతి కాదుల్లా!
ఏమున్నా , లేకున్నా
కట్టం లో గని,
సుకం లో గని తోడున్నోడే 
అసలైన సోపతి గాడు.
ఔ మల్ల!

కామెంట్‌లు