ఆదర్శనీయం:-డా|| బాలాజీ దీక్షితులు పి.వితిరుపతి-8885391722-

 ధర్మనికేతుని ... రూపాన్ని
ప్రేమామయ ... ప్రాణాన్ని
మాట విలువని
పదవీ త్యాగాన్ని
కష్టాలు, కన్నీరు నింపుకొని
సామాన్య మనిషిగా
ఇలన బ్రతికిన
భగవంతుడి  గాధను
తన తపస్సుతో
బ్రహ్మ శక్తితో
వల్మీకిగా మారిన ... బోయవాడు
అద్బుతంగా... తరతరాల సాక్షిగా
అందించిన రామాయణం
రసమయ కావ్యం
పలు మనసుల
వ్యక్తిత్వాలు
కళ్ళకు కట్టిన చిత్రం
మన నడకకు మార్గం నేర్పిన
రూపకం ... ఆదర్శనీయం ... రామాయణం


కామెంట్‌లు