శ్రీ కృష్ణుడి వర్ణన : పాట ..:-గాజులనరసింహ--నాగటూరు గ్రామంకర్నూలు జిల్లా9177071129
పల్లవి :-

ఎంతముద్దు ఎంతముద్దు.  నువ్వెంతముద్దు..2
గోపాలబాల గోవిిందలాల నూవ్వెంతముద్దు .. ఎంత ముద్దు...

మురిపాలబాల మువ్వాగోపాల..నూవ్వెంతముద్దు..
అమ్మ కౌగిళ్ళ నీకవ్వింత ఎంతముద్దు
నినుగన్న ఆ కనులకెంత ముద్దు...""మురిపాలబాల""పల్లవి""

చరణం :-1

పున్నమి వెన్నెల్లో నీ వన్నెంత ముద్దు
వగలచిన్నెల్లో నీ నవ్వెంత ముద్దు
నడియాడు నడకల్లా నీ బుడియాడుగులెంత ముద్దు
ఆరుబయట ఆటాడు నీ ఆటలెంత ముద్దు
ముద్దులొలుకుబాల మురిపాలబాల నూవ్వెంతముద్దు ""పల్లవి""

చరణం:-2

నున్న నున్నాని నీజబ్బలేనంత ముద్దు
మెత్త మెత్తాని నీ బుగ్గలేనంత ముద్దు
నూ నుదుట దిద్ధీన సింధూరమెంత ముద్దు
కమలాక్షులాంటి ఆ కళ్ళెంత ముద్దు
ఎర్ర ఎర్రాన్ని దొండపండంటి ఆ పెదవులెంత ముద్దు
నోరార..!అమ్మా..!యని పిలిచిన ఆ పిలిపేంత ముద్దు
ఎంతముద్దు.."మురిపాల""పల్లవి""

చరణం:-3

నిండు చందమామ0టి ఆ మోమెంత ముద్దు
నల్ల నల్లాని కురుల ఆ చుట్లేంతముద్దు
గల్లు గల్లనిన నీఅందే మువ్వల సడియేంత ముద్దు..
నీ వేణుగానమెంత ముద్దు 
వెయ్యి పడగల శేశ శయనమెంతముద్దు ఎంతముద్దు""మురిపాల""పల్లవి""


కామెంట్‌లు