*శ్రీకాళహస్తీశ్వర శతకము* - పద్యం (౯౨ - 92)

 మత్తేభము:
*దయజూడుండని గొందరాడుదురు, ని | త్యంబు నిన్నుం గొల్చుచున్*
*నియమం బెంతో ఫలంబు నంతియెగదా! | నీ వీయ పిండెంతో, అం*
*తియకానెప్పటికిం దళంబశన బు | ద్ధింజూడ నేలబ్బు, స*
*త్క్రియల న్నిన్ను భజింప నిష్టసుఖముల్ | శ్రీకాళహస్తీశ్వరా!* 
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
ప్రతీ రోజూ నిన్ను పూజించే నీ భక్తులు నిన్ను దయ చూపించమని అడుగుతూ వుంటారు.  మా దగ్గర ఎంత పెద్ద పెనం వున్నా, చేతిలో వున్న పిండిని పట్టే దోసె తయారు అవుతుంది కదా! అలాగే,  ఇవ్వడానికి నీవు తయారు గా వున్నా, ఆ వరాలు అందుకునే భక్తి, శ్రద్ధలు మా వద్ద వుండాలి కదా, శంకరా!  మేము చేసే పూజలకు ఎంత దక్కతుందో అంతే నీవు ఇస్తావు.  నీ దయ ఎక్కువ కావాలంటే, మేము నీవు మెచ్చే మంచి పనులు చేసి, మాకు వచ్చే పుణ్యాన్ని  పెంచుకోవాలి ......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఎవరో కవి అన్నట్టు, మేము "ఇంతలో మోక్షమ్మ కోరే గడుసు బిచ్చగాళ్ళము".  నీకు సమర్పించడానికి మా దగ్గర ధన ధాన్యాలు లేవు, నిన్ను మెప్పించగల తపస్సు చేయలేము.  మహా అయితే మాకు తెలిసింది నీ నామ జపం చేయడం అంతే.  నీ నీడ దొరికితే, మాకు మంచి బుద్ది వచ్చి, నలుగురుకీ పనికి వచ్చేమంచి పనులు చేసి నీ కృప ఎక్కవగా పోందుతాము. !*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
కామెంట్‌లు