మా అక్కినేని :-యలమర్తి అనూరాధ హైదరాబాద్-9247260206


 
అ..ఆ.. లతో అక్షరమాల చందం
జీవితాన్ని ఔపాసన పట్టిన కవి 
కృషితో నేస్తంలా మమైకం
శిఖరాల సందర్శనం సులభం
పట్టుదలే ఊపిరిగా పయనం
విజయం అరచేతుల్లోనే అనుక్షణం
జ్ఞాన అన్వేషణ నిరంతరం 
విజ్ఞాన సముపార్జనే ధ్యేయం 
వినయం ఆభరణంగా శోభన 
ఆత్మీయుడిలా అందరి ఎడల మన్నన్న 
పడిలేచే కెరటంలా సినీ పర్యటన 
ఆరోగ్యమే రక్షణగా యుద్ధం 
నిత్య యవ్వనుడిలా కడవరకు 
ఎందరికో అయిన వాడిలా ఆదరం 
అభిమానుల తోడుగానే నిరంతర ప్రయాణం
నటనకే అందం నాగేశ్వర్రావు
కౌశల్యానికే వన్నె మన ఎ.ఎన్.ఆర్
నేలన లేకున్నా నింగిని చేరుకున్నా
హృదయాలలో సూర్యచంద్రుల్లా సజీవంగానే 
కవిత్వాన్నే పూలమాలగా మార్చి సమర్పిస్తున్నా
నిండు మనసుతో నివాళులర్పిస్తున్నా!

(అక్కినేని గారు మరణించారు అని తెలిసి స్పందించి రాసిన కవితాసుమం. ఆయనకే అంకితం.)

కామెంట్‌లు