శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా.... :-మమత ఐలహైదరాబాద్9247593432

 ఆ.వె
నల్లనయ్యచిన్న నామాలు గలవాడ
గొల్లలెల్ల పొగుడు గొప్పవాడ
నుర్వి జనులు కొలిచె పర్వదినము నేడు
భక్త జనుల బ్రోచు వాసుదేవ
ఆ.వె
అల్లరెంతొ చేయు నపురూపబాలుడు
పాల కడవలన్ని పగులగొట్ట 
గొల్లలిల్లు చేరి మెల్లగా వెన్నను
చెలిమి తోడ పంచి స్నేహితులకు
ఆ.వె
కడవ లన్ని తడిమి కడుపార వెన్నను
మింగి మితము లేక మిత్రులకును
పంచిపెట్టి యెంతొ పరవశించావంట
యేమి లీలలయ్య యెదుకులేశ

కామెంట్‌లు