పద్యాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 వినాయక చవితి సందర్భంగా
క.
మెల్లని చూపుల బోజుడు
తల్లికి ముద్దుల తనయుడు ధరణికి వేల్పై
చల్లగ దీవెన నొసగెడి
నల్లని విఘ్నేశ్వరున్ని నమ్మెను మమతా!
క.
గౌరికి కాపల సుతుడై
తీరికతో మోదకాలు తినుచుండంగన్
జోరుగ వచ్చిన తండ్రిని
భారిగనే యడ్డగించ పంతము బూనెన్
క.
విద్యలకధిపతి నీవే
విద్యల నొసగేటి తండ్రి విఘ్నేశ్వరుడా
విద్యే జనులకు విత్తము
పద్యము వలె విద్యలెల్ల పారించుమయా!

కామెంట్‌లు