*కలగాదీ జగతి యంత కలతల మయమే*
కం
ఇలలో పసిబాలి కలకు
పెలపెల కష్టముల బాధ పెన్నిధి కాగా
సులువే! బాధలు నెగ్గుట
*కలగాదీ జగతి యంత కలతల మయమే!*
కం
కలియుగమున కల్మషమే
సలలితముగ రాజ్యమేల సఖ్యత పోయెన్
విలవిల లాడిన జనులకు
*కలగాదీ జగతి యంత కలతలమయమే*
కం
నిలబడి సౌఖ్యత నెంచని
కలిసి మెలిసి బ్రతకలేని కలియుగ మాయెన్
గలగల నవ్వుల నెరుగని
*కలగాదీ జగతి యంత కలతల మయమే!*
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి