దత్తపదులు:-:-మమత ఐలహైదరాబాద్9247593432

 పాట ,బాట ,మాట ,కోట
ఉ.
పాటలుహెచ్చి జానపద పల్కుల ధోరణి యింపుగూర్చగన్
బాటలు పట్టుచుండె నివి భారతదేశముదాటి వెళ్ళుచున్
మాటలు లేవికన్ తెలుగు మక్కువ గల్గిన గీతమందునన్
కోటల రాజులైన గని కోరిన నృత్యము జేయులేమరిన్
******************************
దత్తపది:-పెద్దల ,ముద్దుగ , నిద్దుర,సద్దులు
ఉ.
పెద్దల నాటి పాటలివి వృద్ధుల కంఠము రాగమాలలే
ముద్దుగ పాడుచుండిరట మోదము తీరగ శ్రద్ధబెట్టుచున్
నిద్దుర బుచ్చుపాపలను నిత్యము కమ్మని పాటడోలికల్
సద్దులుమూటగట్టి జని జానపదాలతొ నాట్లువేదురే

కామెంట్‌లు