లోకరీతి:-మమత ఐలహైదరాబాద్9247593432

 కం
భ్రమపడి కొందరు జెప్పుట
శ్రమతో తప్పులు పలుకుట చాకిరి జయమే
యముడై ధర్మంబనుటకు
సుమధురమా!నీదు మనసు చూడుము మనసా!
ఆ.వె
తాగి నూగి తుదకు తైతక్క లాడేరు
వాగివాగి వాయి వారు జరుపు
తెల్లవారయడుగ తెలియదందురు చూడు
మనసు పెట్టి వినుము మమత మాట
ఆ.వె
లోకరీతి జెప్ప లోగుట్టు యనబోకు
వింతలన్ని యెపుడు చింత లౌన
స్పందనగలమదియె స్పష్టతల్ జూడదా
మనసుపెట్టి వినుముమమతమాట

కామెంట్‌లు