ఆచార్య దేవో భవ :- -బెహరా ఉమామహేశ్వరరావుసెల్ నెంబరు: 9290061336

 మనం నేర్చుకునే విద్యలు రెండు రకాలుగా చెప్పుకోవచ్చును. మొదటిది ఆధ్యాత్మిక విద్య. రెండవది లౌకిక విద్య.
    ఆధ్యాత్మిక విద్య యుగయుగాలుగా భారతీయ సంస్కృతిలో వర్ధిల్లుతుంది. గురు స్థానం చాలా ప్రధానమైనది."మాతృదేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథిదేవోభవ" అనేది వేద వాక్యం.
 పరిణామక్రమంలో  ఆచార్యుడే దేవుడవు తున్నాడు. ఆధ్యాత్మిక పరిభాషలో గురువు, ఆచార్యుడు అనే పదాలు పర్యాయ పదాలుగా వాడుతున్నాం.అలాగే లౌకిక విద్యాబోధనలో మనం ఉపాధ్యాయుడు,బోధకుడు, శిక్షకుడు అధ్యాపకుడు, అనే పరిభాషలో వాడుతున్నాం. ఆధ్యాత్మికమైన, లౌకికమైన,  ఈ పదాలన్నీ గురువు శబ్దానికీ
 పర్యాయపదాలుగా వాడబడుతున్నవే. గురువు అనే శబ్దానికి నిర్వచనం పరిశీలిద్దాం:
1." గుకారోస్త్వంధకారస్యాత్ రు కారస్తన్నిరోధకః//
     అంధకార నిరోధిత్వాత్ ్  "గురు"రిత్యభిధియేతే//
గు-అనే అక్షరానికి అంధకారమని అనగా అజ్ఞానమనే అంధకారం, రు- అనే అక్షరానికి దానిని తొలగించు వాడు అని అనగా అజ్ఞానాంధకారం పారద్రోలి జ్ఞానమనే ప్రకాశమును కలిగించువాడు అని
గురువు అనే పదానికి అర్థం, భావం, వ్యాఖ్యానం.
గురు సాక్షాత్ "పరబ్రహ్మ"స్వరూపుడే కాక మనకు ఐశ్వర్యం, ఆరోగ్యం, శుభం జరగాలన్నా గురువే కారణం, అందుకే ఆయనకు గురవే నమః అని విశేషించి చెప్ప బడినది.
 భారతీయ సంస్కృతికి ముఖ్య గ్రంథాలైన రామాయణ, భారత,భాగవతాలను పరిశీలిస్తే, మహోన్నత గురువులు వారి నుంచి మనం తెలుసుకోదగిన వ్యక్తిత్వ లక్షణాలు చాలా కనిపిస్తాయి. అవి నేటి తరానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
రామాయణంలో గురువులు:- ఆ నాటి ఆదికావ్యం రామాయణ గ్రంథం.ఇది త్రేతాయుగం నాటిది.
రామాయణ గ్రంధం పేరు వినగానే గుర్తుకు వచ్చే గురువు వశిష్ట మహర్షి. ఈయన ఇక్ష్వాకు వంశానికి
తర తరాలుగా గురువు. రామ,లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల నామకరణం చేసిందీ మహర్షి.వేద శాస్త్రాలు విద్యాబుద్ధులు నేర్పడమే కాక యుద్ధ విద్యలు నేర్చుకుని మహా వీరులుగా వెలుగొందడానికి
గురువు వశిష్ఠమహర్షి కారణం. రామావతారం ప్రారంభం నుండి కడవరకు గురు స్థానం అలంకరించినది ఈతడే. ఏనాడు వీరి నుండి ఎటువంటి గురుదక్షిణ గాని ప్రతిఫలంగాని వశిష్ఠుడు ఆశించలేదు. వినయ విధేయతలు విద్యాబుద్ధులు సద్గుణాలన్నీ మానవ జీవితంలో ంంంంంం ఎలా వికసించాలో శ్రీ రాముని ద్వారా విశ్వానికి ఆదర్శమూర్తిగా గాక మహనీయునిగా తీర్చిదిద్దిన మహోన్నత గురువు వశిష్ఠుడు.ౕ
     విద్యార్థి అనగా శిష్యుడు.శిశ్యుడంటే గురువు చేత
శాసింపదగిన వాడు. విద్యార్థి గురువు బోధించినది భక్తిశ్రద్ధలతో నేర్చుకొని చెప్పినట్లే అనుసరించాలి.
గురువు యందు పరిపూర్ణమైన విశ్వాసనీయత  శిష్యునికి ఉండాలి.
రామాయణ మహా గ్రంధం  మనకు తెలియ జేయునది ఏమిటంటే శ్రీరామునికి పట్టాభిషేకం ముహూర్తం నిర్ణయించినది వశిష్ఠుడు.  కానీ ఆ శుభ సమయానికి శ్రీరాముడు అరణ్యవాసానికి వెళ్ళవలసి వచ్చింది. అంత మాత్రం చేత వశిష్టుని గురుత్వానికి కళంకం రాలేదు. రాక్షస సంహారం రామాయణ అవతార ముఖ్య సామాజిక ప్రయోజనం. అందుచేత రాముని వనవాసానికి పంపడానికి వశిష్టుడు ఆ ముహూర్తం పెట్టాడని రాముడికి తెలుసు. అరుంధతి వశిష్ఠుల సత్కారాలను హితబోధలను అరణ్య‌ వాసంలో సీతారామలక్ష్మణులు పొందారు. యోగ వాశిష్టంలో  అనేక ఆధ్యాత్మిక బోధనలను వశిష్ట మహర్షి తెలియజేశాడు. కడకు శ్రీరామ పట్టాభిషేకం జరిపింది వశిష్ట మహర్షి కదా! ఎటువంటి అరమరికలు లేని అభిప్రాయ బేధాలు లేని గురుశిష్య సంబంధానికి వశిష్ఠ గురుత్వం, తార్కాణం (సశేషం)
      

కామెంట్‌లు