మధుభని చిత్రాలు:-కంచనపల్లి వేంకట కృష్ణారావు-9348611445

   స్త్రీలు సృష్టించే కళ ఒక్కొక్క సారి వారి కుటుంబానికే కాదు యావత్ దేశానికి ఉపయోగ పడవచ్చు.
         అటువంటి కళే 'మధుభని చిత్రకళ'. బీహార్లోని మధుభని జిల్లాలో స్త్రీలు ఈ అధ్బుత చిత్రాలు 
సృష్టిస్తున్నారు.2500 సంవత్సరాలనుండి ఈ కళ అక్కడఉంది. ఈ  చిత్రాలు అప్పటిలో అంత ప్రాచుర్యంలోకి రాలేదు.1960లో సంభవించిన కరవు వలన అక్కడి కళాకారులు ఆకలి తీర్చుకోవడంకోసం ఆ చిత్రాలను ఔత్సాహికులకు అమ్మసాగారు.
        ఇంగ్లాండుకు చెందిన విలియం,మిల్ డ్రెడ్ ఆర్చ్ ల్ అనే కళాకారులు ఆ చిత్రాల్లో గొప్పతనం చూసి వాటిని సేకరించడమే కాకుండా వాటిని గురించి విస్తృత ప్రచారం కల్పించారు.ఈ విధంగా మధుభని చిత్రాలు బ్రిటిష్ లైబ్రరీలో,లండన్ రెడ్ క్రాస్ ఆఫీసులో శాశ్వత స్థానం కలిపించారు.
        ఈ చిత్రాల్లో ఉపయోగించే రంగులు ఆయా కళాకారులు కొన్ని ప్రత్యేకమైన చెట్ల విత్తనాలు,చెట్ల నుండి తయారు చేసుకుంటారు!అంటే కృత్రిమ రంగులు ఉపయోగించకుండా ప్రకృతి నుండే సేకరిస్తున్నారు.దేవుళ్ళు,దేవతలు,జంతువులు ఎంతో కళాత్మకంగా చిత్రీకరిస్తారు.
      ఈ కళను గురించి అనేక పత్రికలు ప్రముఖంగా వ్యాసాలు ప్రచురించాయి.అందువలన ప్రపంచ వ్యాప్తంగా ఈ కళారూపాలకు విశేష ఆధరణ లభించి ఎంతోమంది కళాప్రియులు,సేకరణ కర్తలు వీటిని కొంటున్నారు.ఈ చిత్రాలు 200రూపాయల నుండి 40 వేల వరకు ధర పలుకుతాయి.వీటిని మైథిలీ చిత్రాలు అనికూడా అంటారు.
              *****************

కామెంట్‌లు