కొన్ని పుస్తకాలు చదివి పక్కన పెట్టేస్తాం.కొన్ని పస్తకాలు పదే పదే చదవాలనిపిస్తుంది.కొన్ని పుస్తకాలు చదవడమే కాకుండా,కొంత మందికి వాటిని గురించి చెప్పాలని ఉంటుంది,ఎందుకంటే అటువంటి పుస్తకాలు కొంత ఆలోచింప చేస్తాయి!
అటువంటి పుస్తకమే'జిమ్ స్టోవాల్' (Jim Stovall) రచించిన 'అత్యుత్తమ కానుక'అనే నవల
(The Ultimate Gift).ఇది నవల అయినా ఆలోచింపచేసే వ్యక్తిత్వ వికాస పుస్తకం వలె ఉంటుంది.
దీనిని 20th సెంచరీ ఫాక్స్ సంస్థ సినిమాగా తీశారు.ప్రపంచ వ్యాప్తంగా దీనికి చాలా మంచి పేరు వచ్చింది.
దీనిని చదివి,సినిమా చూసి ఎందరో రచయితలు కొన్ని రచనలు చేయగలిగారట.
ఈ పుస్తకంలో అధ్యాయాల పేర్లు 'స్నీహితులే కానుక' 'పనిచెయ్యటం అనే కానుక','చదువు అనే కానుక' ఇలా ఉంటాయి.ప్రతి అధ్యాయం ఆలోచింప చేస్తుంది మరలా మరలా చదవాలనిపిస్తుంది.
స్టోవాల్ రచయిత,సినీ నిర్మాత,ప్రోత్సాహ పరిచే వక్త! ఈయన ఈ నవలే కాకుండా 'లాంప్' అనే నవలగా కూడా వ్రాశాడు.అది కూడా సినిమాగా వచ్చింది.
'ఇది మంచి ప్రేరణాత్మక నవల' అని న్యూయార్క్ టైమ్స్ పత్రికకు చెందిన మార్క్ విక్టర్ హాన్సెన్ వాఖ్యానించారు.
నా ఉద్దేశంలో రచయిత అయిన ప్రతి ఒక్కరూ ఈ నవల చదివితే మంచిది.
ఈ మంచి నవలను తెలుగులోకి కీ॥శే॥ఆర్. శాంతా సుందరి గారు అనవదించారు.మొదటి సారిగా 2013 లో ప్రచురింపబడింది.
ఈ పుస్తకం ప్రముఖ పుస్తకాల షాపుల్లో దొరుకుతుంది.కావాలనుకుంటే 'అమెజాన్'సంస్థనుండి తెప్పించుకోవచ్చు.
పుస్తకం చదవండి ప్రేరణ పొందండి.
మీ కోసం నవలలో అధ్యాయాలకు ముందు పొందు పరచిన వాక్యాలు చదవండి, 'తన సంపదని బంగారంతో కాక స్నేహితులతో కొలిచే వాడే నిజమైన సంపన్నుడు',' చదువు సంధ్యలు అనేవి జీవితాంతం చేసే ప్రయాణంలాటివి వాటి గమ్యం మీరు ప్రయాణం చేసిన కొద్దీ విస్తరిస్తూ ఉంటుంది' ,' నవ్వు అంతరాత్మకి ఒక మంచి ఔషధం మన ప్రపంచానికి ఈ ఔషధం ఇంకా ఎక్కువ అవసరం'.
ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పుస్తకంలో చాలా విషయాలు ఉన్నాయి. పుస్తకం అసాంతం చదివిస్తుంది.
********
అత్యుత్తమ కానుక ఓ మంచి పుస్తకం:-కంచనపల్లి వేంకట కృష్ణారావు9348611445
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి