ప్రజాకవి కాళోజీ*::-*పేరు:బెజుగాం శ్రీజ**ఊరు:గుర్రాలగొంది జిల్లా:సిద్దిపేట**చరవాణి:9391097371*

 *పద్యం*
*సీసమాలిక*
తెలగాణ పోరుకు తేజమ్ముతానయ్యి
కాళోజిగారలు గౌరవముగ
కవితతోనిలదీసి కణికలావెలిగాడు
తెలగాణమనిషిగా తీరుగాంచె
ఒక్కసిరాచుక్క ఓ లక్షమెదడుల
కదలికయన్నాడు ఖ్యాతితోడ
దేశభాషలలోన తెలుగులెస్సయనియు
బోధించెనతడును ముద్దుగానె
బడిపలుకులభాష వద్దనిజెప్పియు
పలుకుబడులభాష పలుకమనెను
అన్యభాషలునేర్చి ఆంధ్రమ్మురాదన్న
వారలనెదురించె పౌరుషముగ
*తేటగీతి*
కవితలెన్నియో వ్రాసియు కాంక్షదీర
తెలుగుభాషనే నమ్మెను దివ్యముగను
ప్రజలకవిగాను కాళన్న ప్రతిమగాంచి 
పేరుప్రఖ్యాతిగాంచెను ధీరుడిగను

కామెంట్‌లు