శివ సూక్తులు – పెద్ది సాంబశివరావు94410 65414, peddissrgnt@gmail.com

భరతమాత కన్న భావనా వెల్లువ
విప్లవంబు గోరు వక్త యతడు
తళుకుమని మెరిసె తమిళకవి భారతి
బ్రతుకు యేండ్లు కాదు బ్రతుకు లెక్క.

పదవ యేట నుండి పాడసాగె సభల
కృతుల వ్రాసి తానె కూర్పు జేసె
మధుర గానమూర్తి మంగళంపల్లియే
బాలమేధ జూపె బాలమురళి.

ఎల్ల లేని ఘనుడు వేంకటేశ్వరరావు
ఇరువదారు గంట లేక బిగిన
మ్రోగజేసె మృదుమృదంగములను
పట్టుబట్టి నేర్వ పనులు జరుగు.

బండ చెముడు యున్న బెథొవెన్ సృష్టించ
గలిగె నూతనంబగు స్వరముల
విశ్వజనుల కెల్ల వీనుల విందుగా
అవిటితనము చేయ అడ్డు రాదు.

పేద యింట బుట్టి బాధలనుభవించి
పూట గడిపి చదివె ఘంటసాల
ఆతడాయెను గద గాయక సామ్రాట్టు
దేశభక్తితోడ ఖైదు జేసె.

కామెంట్‌లు