చిట్యాల ఐలమ్మ జయంతి సందర్భంగా పద్యం : -కటుకం రాజయ్యచరవాణి సంఖ్య:9441560232కలంపేరు:సంఘమిత్ర

 సీ:చిట్యాల ఐలమ్మ చిరుతగా పోరాడి
   రజకకులమునందు రాటుదేలె
   సాయుధపోరాట సమరమ్ము నడిపియు
   విసునూరు దొరలపై విజయమొందె
   భూమిపోరాటము బుజముపై మోసియు
   పంటలు పండించి ఫలిత మొందె
  వెట్టిచాకిరిపైన గట్టిగా పోరాడి
  జైలులో తానుండి జంగునడిపె!!
తేగీ:కొడుకు మరణించె పోరులో కొంపగూలె
      భర్త జైలుపాలవ్వగా బాధదాచి
     విప్లవించిన పోరాట వీరనారి
     మరువ రెప్పుడు మీపేరు మహిన జనులు!!
కామెంట్‌లు