శ్రీ గురజాడ అప్పారావు గారు 1862 సెప్టెంబర్ -21 విశాఖ పట్నం జిల్లా రాయవరం గ్రామంలో
జన్మించారు.బెంగాలు భాషకు ఠాగూర్ లాగా
తెలుగు భాషోద్దరణకు తెలుగు వ్యవహారిక భాషా
వినియోగానికి శ్రీ గురజాడ ఎనలేని కృషి చేసారు.
విజయ నగరంలో డిగ్రీ చదువు పూర్తయ్యాక ,విజ
య నగరంలోనూ డిఫ్యూటీ కలెక్టర్ ఆఫీసులో
గుమస్తాగా చేరారు.కానీ ఆయనలో నిబిడీకృతమై
ఉన్న సాహితీ ప్రతిభ ,రచనా పాటవాల గురించి
ఆనాటి విజయ నగర సంస్థానాధిపతి శ్రీ ఆనంద
గజపతి గుర్తించి విజయనగరం కాలేజీలో ఇంగ్లీషు
లెక్చరర్ గా నియమించారు.అధ్యాపకుడిగా విశేష
కీర్తి గడించారు-శ్రీ గురజాడ. "దేశమంటే మట్టి కాదో
య్ దేశమంటే మనుషులోయ్ " అని ఎలుగెత్తి
చాటిన తెలుగు వైతాళికుడు.బాల్య వివాహాలు ,
కన్యాశుల్కం వంటి సాంఘిక దురాచారులను
ఎదరించిన గొప్ప సంఘసంస్కర్త.కన్యాశుల్కం
దురాచారాన్ని ప్రతిఘటిస్తూ ,శ్రీ గురజాడ రాసిన
గొప్ప నాటకం "కన్యాశుల్కం" ఆంధ్రులందరికీ సుప
రిచతమే.సారంగధర, ముత్యాలసరాలు ,పూర్ణమ్మ
వీరి ఇతర రచనలు.ఇంగ్లీష్ లో కూడా 'సాంగ్స్ అండ్ ది బ్లూ హిల్స్ ' అనే గేయాలు శ్రీ గురజాడ
రాశారు.ఆయన రాసిన కథానికలో 'మీ పేరేమిటి ?'
'' పెద్ద మసీదు 'సంస్కర్త హృదయం ' మాటా మంతి' ఆనాటి పరిస్థితులను ప్రతిబింబింపచేస్తూ
సజీవంగా నేటికి మనకు దర్శనమిస్తాయి. ఆధుని
క తెలుగు సాహిత్యానికి నూతన ఒరవడులు దిద్ది
న శ్రీగురజాడ 1915 నవంబర్ 30న అనారోగ్యం
తో మరణించారు. సంఘ సంస్కర్తగా ఆయన కృషి
కి ఘనమైన నివాళులు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి