సమాజ శాంతితోనే "ప్రపంచ శాంతి: --డా. చిటికెన కిరణ్ కుమార్--సభ్యులు, ఇంటర్నేషనల్ బెనివలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్.సెల్.9490841284రాజన్న సిరిసిల్ల, తెలంగాణ

 సెప్టెంబర్ 21, అంతర్జాతీయ  శాంతి దినోత్సవం సందర్భంగా ప్రత్యేక వ్యాసం......
======================
అంతర్జాతీయ శాంతి దినోత్సవం (International Day of Peace) ఐక్య రాజ్య సమితి దేశాలన్నీ ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21 తేదీన జరుపుకుంటాయి. ... ప్రపంచానికి శాంతి అవసరం గురించి ప్రబోధించే ఈ మహా దినం సందర్భంగా ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో శాంతి ఘంట మోగిస్తారు. ఆ గంటపై ఇలా రాసి ఉంది. "సంపూర్ణ ప్రపంచ శాంతి వర్థిల్లాలి .అని 
ప్రపంచ శాంతి దినోత్సవాన్ని జరుపుకోవడానికి ప్రజలు గుంపుగా ఓ చోట చేరాలనేం లేదు . ఎవరైనా, ఎక్కడైనా ఈ దినోత్సవాన్ని నిర్వహించుకోవచ్చు . ఏ మధ్యాన్న వేళైనా సరే ఒక క్యాండిల్ వెలిగిస్తే చాలు .. లేదా మౌనంగా కొద్దిసేపు కూర్చుని ధ్యానం చేసినా చాలు ... లేదా సహోద్యోగులు, వివిధ సంస్థలు, స్థానిక ప్రభుత్వాలు భారీ కార్యక్రమాన్ని జరిపి శాంతి అవస్యకత గురించి ప్రజలకు చక్కగా వివరించవచ్చు .
         1981లో ఐక్యరాజ్యసమితి  శాంతి ఆశయాలకు అంకితమవ్వాలని, 24 గంటల పాటు కాల్పుల విరమణ చేయాలని నిర్దేశించింది. ఆ రోజున న్యూయార్క్‌లోని ఐరాస ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో శాంతి గంటను మోగించడంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈమధ్య కాలంలో గత ఏడాది కొవిడ్ మహమ్మారి ప్రపంచ మానవాళిని వణికిస్తున్న తరుణంలో మనుషులంతా ఒకటేనని భూమండలంపై ఎక్కడ విపత్తు సంభవించినా అది దేశాలు, ప్రాంతాలు, మతాలు, భాషలకు అతీతంగా అందరినీ ప్రభావితం చేయగలదని నిరూపించింది. ఈ నేపథ్యంలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరెస్ మార్చిలోనే ఆయుధాలను వదిలి కొవిడ్ మహమ్మారిపై ఉమ్మడి పోరాటం కొనసాగించాలని శక్తియుక్తులన్నిటినీ దానిపై కేంద్రీకరించాలని అన్ని యుద్ధ మోహరింపు సైన్యాలకు పిలుపునిచ్చారు. ఆ సందేశం కేవలం యుద్ధంలో ఉన్న వారికే గాక సమస్త మానవాళికి వర్తిస్తుంది.
ఈ అసాధారణ పరిస్థితుల్లో ఈ గండం గట్టెక్కడానికి భూమాతను శాంతింప చేయడానికి ఒకరి ఆలోచనలు మరొకరు పంచుకోవడానికి గళం విప్పాల్సిన అవసరం ఉందని, మనం ఒకరినొకరు సమీపంలో నిలబడలేకపోయినా కలిసి కలలు కనడం ముమ్మాటికీ సాధ్యమేనని, ఐ.రా.స. నొక్కి వక్కాణించింది. ఈ సందర్భంగా దయ, కరుణ, దృఢవిశ్వాసాలను వ్యాప్తి చెందించడంతో బాటు కరోనా బారిన పడ్డ వారి పట్ల ద్వేషాన్ని వీడాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొంది.
20వ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాల్లో దాదాపు 10 కోట్ల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఎన్నో నగరాలు నాశనమయ్యాయి. అనంతరం ఏర్పడిన ఐక్యరాజ్యసమితి శాంతి కోసం పలు తీర్మానాలను ఆమోదించింది. ఐ.రా.స 1981లో బ్రిటన్, కోస్టారికా దేశాల చొరవతో శాంతి దినోత్సవం జరపాలని నిర్ణయించింది. ప్రారంభంలో రోజుల్లో సెప్టెంబరు నెలలోని మూడో మంగళవారం జరిపేవారు. 2001లో సెప్టెంబర్ 21 తేదీ జరపాలని నిర్ణయించారు. ఆ మేరకు 2002 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఆరోజునే జరుపుతున్నారు.
1945లో హిరోషిమా- నాగసాకి నగరాలపై అణుబాంబు దాడి జరిపిన నాటి నుంచి రెండువేలకు పైగా అణ్వాయుధ పరీక్షలు జరిపారు. 75 సంవత్సరాల అనంతరం నేటికీ అమెరికా వద్ద 6185, రష్యా వద్ద 6490 అణ్వాయుధాలు ఉన్నాయని ఆయుధ నియంత్రణ సంస్థ అంచనా వేసింది. 2020లో కేవలం అణ్వాయుధాలపై అమెరికా 5000 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. 2019లో అమెరికా సైనిక వ్యయం 73,200 కోట్ల డాలర్లు. చైనా 26,100 కోట్ల డాలర్ల ఖర్చుతో రెండవ స్థానంలో ఉంది. 7,110 కోట్ల డాలర్ల ఖర్చుతో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. 
ఈ కాలంలోనే ఆయుధాల అమ్మకం కూడా అగ్రరాజ్యాల ప్రయోజనాల్లో ప్రధాన భాగమయింది. మనకు కనబడుతుంది. అందునా ముఖ్యంగా అమెరికా తమ ఆయుధాలను అమ్ముకునేందుకు ఆసియాలోని వివిధ దేశాల మధ్య వివాదాలను యుద్ధాలుగా మార్చిన ఘనత దక్కించుకుంది. అరబ్, ఇజ్రాయిల్ యుద్ధానంతరం ఆ ప్రాంతం నిరంతరం రావణాసురుడి కాష్టంలా కాలుతూనే వుంది. భారత ఉపఖండంలో   జరిగిన యుద్ధాల్లో అమెరికా నిర్వహించిన పాత్ర అదేవిధంగా, కొన్ని క్యాంపుల నిర్వహణకు ఆయుధాలను అందించిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ప్రాంతీయ యుద్ధాలే కాక అనేక ఆఫ్రికా దేశాల్లో అంతర్యుద్ధాలు ఏళ్లతరబడి కొనసాగుతున్నాయి.
యుద్ధాల వల్ల ప్రజలు నష్టపోవడమే కాక ప్రకృతికి ఎంతో విఘాతం కలుగుతుంది. అణ్వాయుధాల ఉత్పత్తిలో వచ్చే వ్యర్థాలను పారవేయడం ద్వారా కలిగే అణుధార్మికత, జీవ రసాయన ఆయుధాల ప్రయోగాల సమయంలో కలిగే వాతావరణ కాలుష్యాల ప్రభావం ప్రజల ఆరోగ్యంపై నిత్యం ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ శాంతి ఆవశ్యకత ఎంతైనా ఉంది.
ఆక్రమణలు. దురాక్రమణలు, ఆధిపత్య భావజాలాలు, ఉగ్రవాదానికి పెను ఊతం ఇస్తున్న పరిస్థితుల్లో ప్రపంచ శాంతి ఇంకా చాలాదేశాల్లో నీటిమీద రాతల్లా కనబడుతోంది. ఇది మారాలి, ప్రపంచంలో శాంతి పరిఢవిల్లాలి.. యుద్ధంలేని, అణ్వాయుధాలు లేని, క్షిపణి దాడులు లేని, ఆకలి భాధలు లేని ప్రపంచం నిజమైన శాంతికి మార్గం తెరవాలని ప్రజానీకం ఎదురు చూస్తోంది.
-------------------
-డా చిటికెన కు అరుదైన గౌరవం
======================
ప్రపంచ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న ప్రముఖ వ్యాసకర్త డాక్టర్ చిటికెన 
======================
        సెప్టెంబర్ 18  కొరియాకు చెందిన *HWPL ( హెవెన్లీ కల్చర్, వరల్డ్ పీస్,  రిస్టోరేషన్ ఆఫ్ లైట్ )* వారి ఆహ్వానం మేరకు   ఈ సంస్థ నిర్వహించే 7 వ వార్షికోత్సవం లో......ప్రతి సంవత్సరం  నిర్వహించే ప్రపంచ  శాంతి సమ్మేళనాన్ని యధాతధంగా ఈ సంవత్సరం అంతర్జాల జూమ్ వేదికగా నిర్వహించిన కార్యక్రమంలో హెచ్. డబ్యూ. పి. ఎల్ యూత్ విభాగం ఐ. పి. వై. జీ ( ఇంటర్నేషనల్ పీస్ యూత్ గ్రూప్ ) ప్రతినిధి తెలంగాణ సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాసకర్త *-డా. చిటికెన కిరణ్ కుమార్* జామ్ అంతర్జాల సమ్మేళనంలో   పాల్గొని ప్రపంచ శాంతి గురించి గురించి జరిగే కార్యక్రమంలో పాల్గొన్నారు.   ఆక్రమణలు. దురాక్రమణలు, ఆధిపత్య భావజాలాలు, ఉగ్రవాదానికి పెను ఊతం ఇస్తున్న పరిస్థితుల్లో ప్రపంచ శాంతి ఇంకా చాలాదేశాల్లో నీటిమీద రాతల్లా కనబడుతోంది. ఇది మారాలి, ప్రపంచంలో శాంతి పరిఢవిల్లాలి.. యుద్ధంలేని, అణ్వాయుధాలు లేని, క్షిపణి దాడులు లేని, ఆకలి భాధలు లేని ప్రపంచం నిజమైన శాంతికి మార్గం తెరవాలని ప్రజానీకం ఎదురు చూస్తోంది. తన సందేశాన్ని  తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మ్యాన్ హీలీ   వ్యవహరించగా వివిధ దాదాపు 60 దేశాల నుండి సంస్థ ప్రతినిధులు  తమ తమ ప్రసంగాలు వినిపించారు.
కామెంట్‌లు