నమో విష్ణు రూపా !:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

నమో విష్ణు రూపా! ఓం నమో విశ్వరూపా!
మా తేజోమయ జీవిత రూపా
హే సహస్ర నామ దీపా!

ఆది దేవుడవు నీవేనయ్యా
ఆదుకోను ఇక రావయ్యా
మమ్మేలుకోను ఇక లేవయ్యా
సరుగున పరుగున రావయ్య!

దిశ దశలను చాటేటి దశావతారం అపురూప
మా దారిద్ర్యాన్ని నీవు రూపు మాప
అంతా ఒకటిగా కూడి శ్రద్ధాసక్తులత మేం పాడి
చేరితిమయ్యా నీ సన్నిధి ఇక నీవేగా మా పెన్నిధి!

పూలు పండ్లతో పూజిస్తాం
ప్రతినిత్యం నీ పూజలు చేస్తాం
ఉండ్రాళ్ళను నీకర్పిస్తం మేం
గుంజీలను ఇక మేం తీస్తాం !

వరాలను అందించే నీ ఆశీర్వాద హస్తం
అందుకో ను ఆనందంతో మేమిక వస్తం
జయహో జయహో వినాయక
జయహో జయహో మా గణనాయక!

జయహో జయహో సర్వలోక రూప
జయ జయ మా సహస్రనామ దీప
శయ నించే నీ ఊయల మేం ఊప
మా పాపాలను వెంటనే నీవిక బాప

కామెంట్‌లు