మన కాళోజీ తెలంగాణ శివాజీ : ---గుర్రాల లక్ష్మారెడ్డి. కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
ప్రత్యేక రాష్ట్రంకై బీజం వేసిన నారాయణరావు కాలోజి
నిరంతరం పోరాటం జరిపిన మన తెలంగాణ వీర శివాజీ
నేడే ఈనాడే మీరంతా జాగృతి లై మీలోజీ
సదా ఆయనను స్మరించుకుందాం చలోజీ !

ప్రజా హక్కుల కోసం పరితపించిన వాడు
ప్రజాకవిగా కీర్తి ప్రతిష్ఠలను పెంచుకున్న రేడు
పోరాటం తన ఊపిరిగా ఎంచుకున్న సూరీడు
నారాయణ రావు కాలేజీ మన తెలంగాణ వీర శివాజీ!

తెలంగాణ యాసలో ప్రజల గోసను
వినిపించిన వాడు
మన మగాణ సాహస విత్తనాల చల్లి మొలిపించిన వాడు
కాఫీ సమూహం సృష్టించిన కవిత్వానికి సమ కవిత్వం పుట్టించినవాడు
తంగేడు పూల సమీకరణ మోదుగు పూల పోరాటం నా తెలంగాణ అన్నాడు డు!

ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్ళకు కదలిక అని చెప్పినవాడు
అక్షర ఆయుధాలను అలవోకగా సంబంధించిన తెలంగాణ రేడు
అందరి గుండెల్లో నేటికీ కొలువై కొలువబడుతున్న డు
విశిష్ట వ్యక్తి గా తెలంగాణ చరిత్రలో చెరగని ముద్రవేసుకున్నడు.

అతనే అతనే మన కాలోజీ
అంతా స్మరిధ్ధాం ఇక చలోజీ!


కామెంట్‌లు