యాదాద్రి వైభవం (కవిత):-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
పలు శిల్ప కళాఖండాలతో
అలరారు ఈమా ఆలయం
కొలువై ఉన్న మాకుల దైవం
శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం !

సామాన్యులు మాన్యులై రక్తితో
భక్తితో తరించారులే వారిక్కడ
భూతల స్వర్గాన్ని తలపించే
ఈ ఆలయం లేదులే మరెక్కడా!

పచ్చని ప్రకృతి అందాలతో
నందనవనంలా తానుంది
చక్కని ఆకృతి శిల్పాలతో
ఇలలోచెలరేగుతూ ఉంది !

అజంతా ఎల్లోరా ఖజురహో గవాక్ష
 అందాలను ఇందులో చూడవచ్చు
రోజంతా మోజెంతో  పెంచుకొని
ధ్యానిస్తే మనం మోక్ష మందవచ్చు 

యజ్ఞాలకు యాగాలకు
నిలయమైనది ఈప్రదేశం
యోగులకు భోగులకు
అందించూ ఓ సందేశం !

నలుదిక్కుల మెడలెత్తి చూసే
రంజైన రాజవీధి గోపురాలు
వాడ వాడ జాడ తెలుపు
మాడ వీధుల మూపురాలు !

సమస్త వేదాలను ఘోషించే
ఈ మన

యాదగిరి గిరులు
నమస్తే తెలంగాణ రాష్ట్రం
అందించిన తరగని శిరులు !

భళా! బహుళ శిల్పకళారూపాలతో
కూడుకున్న మన దివ్యమైన క్షేత్రం
మహానుభావుల ముఖచిత్రాలతో
మనం వీక్షించే రమ్యమైనదీ  క్షేత్రం!
 

కామెంట్‌లు