పండుగొచ్చే(జానపద గీతం):-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.

పండుగొచ్చె పండుగొచ్చె చూడవే
మరదలు పిల్లా ఓ మరదలు పిల్లా 
మనసుపడి వస్తుంటివి మల్లమల్ల
వయసు తడితో చేయకే గుండెగుల్ల

పండుగొస్తె ఏమిటి బావయా
దిండుతో కొడతావు నీవయా 
పండువెన్నెల్లో పడకేస్తావయా
నా బుగ్గలని  కొరికేస్తావయా. !

రాను రాను పండుగకు నేనయా
నువ్వొస్తేనే  నేనొసస్తా సరేనయా
చిలకతోని కబురంపు నీవయా
ఈ చిలకల కొలికొస్తుందప్పుడయా 

ఏదేదో చెబుతుంటవు తుంటరిపిల్ల
ఎగిరి గంతులేస్తుంటవు నీవు మల్ల
బంతిపూల బతుకమ్మకు నిలువెల్ల
పూలు జల్లి ఆడేది నీవే కదా మల్ల!

గునుగు పూలు గుమ్మడి పూలు 
తంగేడు పూలు నేతెప్పిస్తా పిల్లా
వచ్చి నీవు ఆదుకోవే నన్ను మల్లా
ముద్దు మురిపాలతో కొట్టకు జెల్లా

బంగారు బతుకమ్మకు నీవచ్చి
సింగారపు దండలనే ఇక గుచ్చి
పలు పూలతో పూజలను చేస్తే
వస్తే నేను కడతాను మరదలు పిల్ల 

నీ మెడలో పుస్తే నేను కడతాను
నుదుట బొట్టు కూడా పెడతాను
మరదలు పిల్ల నా మరదలు పిల్ల
మరవకుండ నీవు వేగరావే మల్ల !

కామెంట్‌లు