వినాయక చారిత్రక చవితి:-గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్ నెంబర్.9491387977.నాగర్ కర్నూలు జిల్లా.

పవిత్ర భాద్రపద శుద్ధ చవితి
గణనాయక వినాయక చవితి
గణాధిపత్యం అందుకున్న గణపతి
వ్రాయసకారుడైన మన వాక్పతి  !

పరిమిత మతి చంద్రుని ఢీకొన్న గణపతి
తారా పతిని శిక్షించి శిక్షణ పెంచిన అధిపతి
వాచస్పతి బృహస్పతి బ్రాహ్మణ స్పతి సరస్వతి
గణం సుగుణం ఆదిపత్య అనుచరగణం రణాధిపతి !

మనం కోరిన విద్యలకెల్ల ఒజ్జ
అందరం పూజించే గణపతి బొజ్జ
విఘ్నపతి అయినా మన గణపతి
పెళ్లికి వెయ్యి విజ్ఞానాల అధోగతి !

ఇది అంతా అచ్చెరువొంది విషయం
తెలిస్తే తే కాదులే అది అతిశయం
గణపతి పెళ్ళికి దుర్లెగా సంశయం
మాతృదేవోభవతో పూర్తైనాశయం !

గణాధిపతిది శాంత స్వభావం స్థితి
వాచస్పతిది ఆత్మానం స్థితి ప్రకృతి
తారాపతిది పరిమిత స్థితి వికృతి
సంభవించగా గుణపాఠం గ్రహస్థితి!

సావధానంగా గా వీటిని పరిశీలిస్తే
తేలుతుంది లోకులకు గుణపాఠం
దురుసుగా ఉండరాదన్న సత్యం
వర్ధిల్లునుగా ఇలలో ఇక నిత్యం !

కామెంట్‌లు