దేవుడున్నాడా ?ఈ కలిలో: - డాక్టర్ బెజ్జంకి, మాచర్ల , 9848562726

 సీ.పాపిష్టి మూకల బాధలు పడలేము
           పాపహరా!దేవ పాహి పాహి
    దుష్టుల దుర్మార్గ చేష్టలణచవయ్య
          దుష్టసంహార ఓ! దురిత దూర!
    అతివల మానాలు హరియించువారిని
           కామహరా! నీవు కాల్చవేల
   సంఘవిద్రోహుల జాతకములు మార్చు
        బ్రహ్మదేవుడ నీకు పాడియౌను
తేగీ.మూడుయుగముల దుష్టుల పీడనణచి
      సుర మునిజనుల కావ నసురుల నణచి
      కలియుగ నరుల హింసించు కర్కశులను
      పీచమడచని దేవుడు పేరుకేల.
      చెప్పుచున్నాడు బెజ్జంకి చేదు నిజము.
                                         

కామెంట్‌లు