గం గణపతయే నమః! "తొలి పూజ్యుడు" "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

👌"తొలి పూజ్యుడు" గణపతి

      పసుపు ముద్ద "గణపతి"
      శుభము లొసగు "గణపతి"
               ఓ తెలుగు బాల!
 ( తెలుగు బాల పదాలు., )      
🔯 "ఆదౌ పూజ్యో గణాధిప:" అనెడు, ఆర్యోక్తి ప్రకారం;
శ్రీమహా గణాధిపతి స్వామివారు... ప్ర ప్రథమముగా ( మొట్ట మొదటి సారిగా) భక్త మహాశయు లందరూ పూజించే దైవము! 
🔯ప్రతీ కార్య క్రమము నందు శుభప్రద మైన "పసుపును ముద్ద"గా చేస్తాము! ఆ మూర్తికి  "శ్రీ మహా గణాధిపతి స్వామి"వారిని ఆహ్వానించు చున్నాము.  ఆ విధముగా శ్రీస్వామి వారిని.. భక్తి ప్రపత్తులతో పూజించు చున్నాము! దీనినే "క్షిప్ర గణపతి పూజ" అంటారు
  🔯 శ్రీ స్వామి వారు.. ఆరాధకులు కోరిన కోరికలను నెరవేర్చు చున్నాడు. సకల మానవాళికి శుభములు కలిగించు చున్నాడు.. క్షిప్ర గణపతి స్వామివారు!
🙏 ప్రార్థనా పద్యం (కందం)🙏
       సర్వారంభముల కొలుతు
       పర్వముల, గణాధిపతిని; భక్తుల కెల్లన్
 
       గర్వము సోకని, విజయ మ
        ఖర్వముగా నొసగు వేల్పు, కామిత ఫలదున్!!
          ( శ్రీ శివానంద లహరి., శ్రీ కార్యం పూడి రాజమన్నారు )
ఓం గం గణపతయే నమః!
కామెంట్‌లు