ఓం గం గణపతయే నమః!:- విఘ్నేశ్వర స్వామి "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

 👌విఘ్నములు తొలగించు!
      విజయములు కలిగించు!
      విఘ్నేశ్వరా! హరా!
                 ఓ విఘ్న రాజ!
        ( విఘ్న రాజ  పదాలు., )      
🔯 విఘ్నేశ్వర స్వామి... విఘ్న నాయకుడు! విజయ దాయకుడు! విఘ్న నాశకుడు..  శ్రీ స్వామివారు!
☸️ విఘ్నము లనగా .. భయము, భ్రాంతి, సోమరి తనము, మోహము, నిద్ర.. మున్నగునవి!అవి మన పురోభివృద్ధికి అవరోధములను కలిగించు చున్నాయి!వాటిని తొలగించి; జ్ఞానము, విజ్ఞానములు అనుగ్రహించు 
 వాడే.. విఘ్నేశ్వర స్వామి!
🔯 ఆరాధకులు మరియు సాధకులు  చేపట్టిన, సమస్త మైన కార్య క్రమము లందు, విఘ్నములు తొలగించు వాడు! సకల మానవాళికి విజయములు కలిగించు వాడు! విఘ్నేశ్వర స్వామి!
🙏 ప్రార్థనా పద్యం (కందం)🙏
       ఏ క్షణమున ప్రార్థించిన
       తక్షణ మరుదెంచి, విఘ్న దైత్యావళులన్
       శిక్షించి, సాధు జనులను
       రక్షించు, గణేశు తలతు లంబోదరునిన్
          ( శ్రీమత్ శివ చాలీసా., శ్రీ పులవర్తి నూకాల రావు శర్మ., )
ఓం గం గణపతయే నమః!
కామెంట్‌లు