ఓం గం గణపతయే నమః! శ్రీ వర సిద్ధి వినాయక స్వామి "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

 👌 వరముల నొసగు మాకు!
      సిద్ధి బుద్ధుల నెపుడు!
      లోకేశ్వరా! హరా!
                 ఓ విఘ్న రాజ!
        ( విఘ్న రాజ  పదాలు., )      
🔯 శ్రీ మహా గణాధిపతి స్వామి వారు.. సిద్ధి, బుద్ధి సమేతుడు! వరాzభయ దాయకుడు! పరమ కారుణ్య మూర్తి!
☸️ విఘ్నాధి పత్యము వహించిన, వినాయకుడు .. పరమ శివునకు  జ్యేష్ఠ కుమారుడు! పార్వతీ దేవికి ప్రియ సుతుడు!
🔯సకల మానవాళికి .. కోరిన వరములను; సిద్ధి, బుద్దులను అనుగ్రహించు చున్నాడు! సమస్త భయమును పోగొట్టు చున్నాడు.. శ్రీ వర సిద్ధి వినాయక స్వామి వారు!
🙏 ప్రార్థనా పద్యం (తేట గీతి )
      ఆది దేవు డందరికిని "ఆది గురుడు" 
       వివిధ రూపాల లో నుండి, "విజయ" మొసగి;
        "బుధ్ధి" అంతట సమకూర్చి, "సిద్ధి" యొసగు!
        పార్వతీ సుతు డెపుడు, కాపాడు గాత!
          ( డాక్టర్. మీగడ రామలింగ స్వామి., )
       ఓం గం గణపతయే నమః!
కామెంట్‌లు