👌మోదక ప్రియుడ వీవు!
మూషిక వాహనుడవు!
హేరంబ! వినాయక!
ఓ విఘ్న రాజ!
( విఘ్న రాజ పదాలు.,)
🔯 శ్రీమహా గణాధిపతి స్వామి వారు.. మోదక ప్రియుడు! కనుక భక్త మహాశయు లందరు... శ్రీ స్వామి వారికి ప్రియమైన, మోదకము లగు... "ఉండ్రాళ్ళు, జిల్లేడు కాయలు" మున్నగు వాటిని; శ్రీస్వామి వారికి నివేదన చేయు చున్నారు!
👌"హేరంబు"డనగా.. శ్రీ మహారుద్ర దేవుని వద్ద నుండు వాడు! సాంబ శివుని కుమారుడు! భక్తులను వృద్ధి పొందించు వాడు. కనుక, "హేరంబు" డని పేరు! దుష్టులను, విఘ్నములను.. శిక్షించు వాడు. కనుక, "వినాయకు"డని పేరు!
🙏ప్రార్ధనా పద్యము
(ఉత్పల మాల)
మోదక హస్తునిన్, ధవళ మూషిక వాహను, ఏకదంతు, లం
బోదరు, అంబికా తనయు,ఊర్జిత పుణ్యు, గణేశు, దేవతా
హ్లాద గరిష్ఠు, దంతి ముఖు, అంచిత భక్త వర ప్రదాయకున్,
మోదము తోడ హస్తములు మోడ్చి, భజించెద నిష్ట సిద్ధికిన్!!
( చాటు పద్య మణి మంజరి., పూర్వ కవి విరచితం., )
ఓం గం గణ పతయే నమః!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి