ఓం నమః శివాయ!!సాంబ శివుని లీలలు "శంకర ప్రియ.," శీల.,సంచార వాణి: ,99127 67098

 👌శివా! నీదు లీలలు!
     సుందర మనోఙ్ఞములు!
     శుభ మంగళ కరములు!
            ఓ సాంబ దేవ!
( సాంబ దేవ పదాలు., )
      
🔯 శ్రీ మన్మహా దేవుడు, దేవ దేవుడయిన సాంబ శివుని యొక్క నవ్య దివ్య లీలలు... అద్వితీయములు! అచింత్యములు!
🙏అమరేశ్వరా! శివా!   అంతరిక్షము నందున్న  నక్షత్రములు లెక్కింప వచ్చును! ఆకాశములో నున్న మేఘముల నుండి.. భూమండలం పైన పడుతున్న, వర్షం చినుకులను; పలు ఎడారుల లో నున్న.. ఇసుక రేణువులను లెక్కింప వచ్చును.
         కానీ, ఆది దేవా! శివా! మీ మహిమాన్విత మైన, మంగళకర మైన దివ్య లీలా వైభవమును మాత్రం; అభివర్ణింప లేకున్నాము!అల్పజ్ఞుల మైన మేము! స్వామి!
🙏ప్రార్ధనా పద్యము
          ( ఉత్పల మాల )
      ఎట్లు ప్రయాస కోర్చి, గణియింప వచ్చును, నింగి చుక్కలన్;
       ఎట్లు ప్రయాస కోర్చి, గణియింప వచ్చును, వాన చిన్కులన్;
       ఎట్లు ప్రయాస కోర్చి, గణియింప వచ్చును, ధూళిరేణులన్;
      ఎట్లు గణింతు మయ్య! భవదీయ మహాద్భుత లీలలన్ శివా!
( శ్రీ భీమఖండం., తెలుగు సేత: శ్రీ తటవర్తి రాఘవ రాజు.,)
 ఓంనమః శివాయై! నమః శివాయ!
కామెంట్‌లు