ఓం గం గణపతయే నమః!--ఆప ద్బాంధవుడు "శంకర ప్రియ.," శీ ల., సంచార వాణి: 99127 67098

👌భక్తి శ్రద్ధల తోడ
     కొలుచు చున్న వారికి
     ఆత్మ బంధువు నీవె!
               ఓ విఘ్న రాజ!
     ( విఘ్న రాజ పదాలు. )
👌శ్రీ వరసిద్ధి వినాయక స్వామి... ఆపదలలో నున్న వారికి ఆత్మ బంధువు. అనాధలైన, దిక్కు లేని వారిని రక్షించు చున్నాడు! తనను.. భక్తి ప్రపత్తు లతో సేవించు వారికి; ఏ విధమైన  విఘ్నములు ( ఆటంకములు ) లేకుండా,  వారి కార్యములను నెరవేర్చు  చున్నాడు. కనుక, "మ్రొక్కు వారి పనులు చక్క జేసేడు సామి!" అని, అచ్చ తెలుగు పదము.
        ఓం గం గణ పతయే నమః! 
కామెంట్‌లు