నారాయణి! నమోస్తు తే! వర లక్ష్మీ దేవి "శంకర ప్రియ.," శీ ల.,సంచార వాణి: 99127 67098

 👌శ్రీమ న్మహా విష్ణు

      మాయా విలాసినీ!
      నమః శతము వైష్ణవి!
               నారాయణి! శివాని!
 ( "నారాయణి" పదాలు., )      
🔯 పరం బ్రహ్మ రూపిణీ నారాయణి, వరలక్ష్మీ దేవి".. శ్రీమంతు డయిన మహావిష్ణుని యొక్క మాయాశక్తి రూపిణీ!
🔯శ్రావణ మాసంలో వచ్చే శుక్ర వారం నాడు.. "వరలక్ష్మీ దేవి" పూజలను; స్త్రీ లందరూ భక్తి శ్రద్ధలతో ఆచరించు చున్నారు.
🔯 వరలక్ష్మీ దేవి దివ్యానుగ్రహము వలన, స్త్రీ లందరు... "సుమంగళి"గా నుండ వలెనని, తమ సంతతి వారు.. భోగ భాగ్యము లతో జీవించ వలెనని; త్రికరణ శుద్ధిగా శ్రీమాతను ప్రార్థించు చున్నారు!
🙏 మత్తేభం (ప్రార్థనా) పద్యం
         తెలికొండన్ తెలిదైవ మైన శివు నంతే వాసివిన్, ప్రేయసీ
         లలనా రత్నమ వీవు! శైలజ! మహా దేవీ! సదా విష్ణు దై
         వల సద్వక్షము నం దెసంగెడు కృపా వల్లీ! కృపన్, సర్వ మం
          గళ గౌరీ! వరలక్ష్మి! మా కొసగుడీ కామ్యార్ధ సర్వస్వమున్!!
      
     ( రచన: "ఆర్షకవి శిరోమణి" విద్వాన్ బులుసు వేంకటేశ్వరులు గారు వ్రాసిన "మంగళ గౌరీ వరలక్ష్మి శతకము" నుండి సంకలనం )

కామెంట్‌లు