*మణిపూసలు(వీరనారిచాకలిఐలమ్మ)*:- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట**చరవాణి:9949144820*
ఆత్మగల్ల ఆడబిడ్డ 
 పుట్టిపెరిగెనుపులిబిడ్డ
రజక జాతి రత్నమోలె
మురిసిమెరిసె తెలుగుగడ్డ

అగ్రవర్ణ దోపిడీలు 
స్త్రీలపైన ఆగడాలు 
అరికట్టి విముక్తినివ్వ
జుళిపించెనురుద్రజూలు

విప్లవాలచరితరాసి
రజాకారులతరిమేసి
వీరనారిగనునిలచెను
నారిమణులముక్తిజేసి

జనులనునొకబాటనిలిపి
భూమికొరకుపోరుసలిపి
కొంగునడుముజుట్టికదిలె
దౌర్జన్యములెన్నొనాపి

కులముకుట్రదౌర్జన్యము
అరికట్టినిలచెసర్వము
దొరలపెత్తనమునకామె
పాడెనుచరమగీతము
           ***
(సెప్టెంబరు 10నచాకలి ఐలమ్మవర్దంతి సందర్భముగవిప్లవజోహార్లు అర్పిస్తూ....)


కామెంట్‌లు