1.
భరతదేశ మహానేత
బోసినవ్వులమాతాత
దేశ స్వేచ్చనుకాపాడి
పెంచెను దశదిశలఘనత
2
గుజరాతురాష్ట్రమ్ములోన
పోరుబందరుగడ్డపైన
శాంతిమూర్తిబాపుగారు
జాతిపితగనుదయించెను
3
మనసులోనస్వేచ్చదలచి
సాయుధ దళ మందునిలిచి
హింసలేని పోరుసలిపె
మానవతను చేరదీసి
4
హరిజనులనుచేరదీసి
సకలజనులనొకటిచేసి
త్యాగమూర్తియైవెలసిను
జ్ఞానమంతధారబోసి
5.
బానిసత్వపుబ్రతుకులను
పూర్తిగానుతొలగించెను
ధర్మ యుద్ధ మాచరించి
గాంధిమనలవిడిపించెను
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి