*నరరూపరాక్షసుడు(మణిపూసలు)*:-- *మిట్టపల్లి పరశురాములు*- *సిద్దిపేట* *చరవాణి:9949144820*
బంధాలనుమరిచినోడు
స్నేహబంధమెరగనోడు
 మమతలేనిదానవుడై
కఠిన ఎదనుకలిగినోడు

పసిపాపనుకాటేసి
మూటగట్టిపారేసి
పాపమూటకట్టుకొనియె
మానవతనుమరిచేసి

పేగుబంధమునుత్రెంచి
రక్తసింధూరముపంచి
ఎంతపనిచేశావురా
వంశవృక్షమునుతెంచి

కామెంట్‌లు