వర్షాకాలం:- కె.లహరి-9వ తరగతిజి.ప.ఉ‌పాఠశాల కుకునూర్ పల్లి.కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.

 వచ్చింది వచ్చింది
వర్షాకాలం వచ్చింది
వరదలతో నింపింది
వాగులు వంకలను
చెరువులన్ని నింపింది
బీడు భూములను తడిపింది
బీదలకు సంతోషం కలిగింది
కష్టాలను తొలగించింది
కన్నీరు  తుడిచింది
చేతినిండా పని దొరికింది
రైతన్నకు సంతోషాన్నిచ్చింది
పచ్చదనాన్ని నింపింది
పంటలు బాగా పండించి
అందరి కడుపు నింపాడు
అన్నదాత  అయ్యాడు
అందుకే వర్షాకాలం
నాకెంతో ఇష్టం.


కామెంట్‌లు