అమ్మ:- శోభన్ బాబు-9వ తరగతి .ఈ/యం.జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.

 అమితమైనది అమ్మ ప్రేమ
అంతులేని అనురాగం
అపురూపం అమ్మ మాట
అమ్మ బుద్ధి చెప్పి బుజ్జగించు
విద్యాబుద్ధులు నేర్పించి
విషయాలెన్నో చెప్పును
అమ్మ ఆకాశమంత ఎత్తు
అమ్మ ప్రేమ కమ్మనైనది
అలుపెరుగనిది అమ్మ ఓర్పు
కష్టములెన్నైనా భరియించును
కన్నబిడ్డల పెంచును
కడుపునిండా తినిపించును
కన్నకలలు నెరవేరడానికి
కష్టించి పనిచేయును
అమ్మ దేవుడిచ్చిన వరం
గుడి లేని దేవత అమ్మ
అమ్మ ఋణం తీర్చుకోలేనిది.

.

కామెంట్‌లు