మంచి స్నేహితులు కథ:-B . మౌనిక8వ,తరగతిజిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల కొండపాకజిల్లా:సిద్దిపేట

 ఒక ఊరిలో అనిత, సునిత అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ చక్కగా బడికి వెళ్లి కలిసిమెలిసి చదువుకునే వారు.కాని సునీత పెద్దింటి అమ్మాయి, అనిత పేద కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి ‌. వారు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని బడికి మంచి పేరు తెచ్చే వారు. సునీత పెద్దింటి అమ్మాయి అయినప్పటికీ డబ్బు ఉందని గర్వపడే ది కాదు. అందరికీ సహాయం చేసేది. కానీ  సునిత అమ్మనాన్నలు మంచి వారు కాదు, ఎందుకంటే వారికి డబ్బు ఉందని గర్వంతో అనితను చిన్న చూపు చూసేవారు. ఆమె ఇంటికి వెళ్ళినప్పుడు పనిమనిషి కంటే హినంగా చూసేవారు. కానీ సునీత మాత్రం అందరూ మనుషులే డబ్బుతోని ప్రేమానురాగాలను కొనలేమని అందరితో కలిసిపోయేది ‌‌. ఒకరోజు అనిత సునీత కలిసి ఉండటం చూసిసునీత వాళ్ళ అమ్మ నాన్నలకు కోపం ఎక్కువై, అమ్మాయితో ఎప్పుడు కలవకూడదని హెచ్చరించారు.
అప్పుడు సునీత వాళ్ళ అమ్మానాన్న బుద్ధి చెప్పాలని, ఒకరోజు అనిత సునిత ఒకరిటిఫిన్ బాక్స్ ఒకరు మార్చుకోని తింటుండగా సునీత తల్లిదండ్రి ఆమెను కొడుతూ తీసుకెళ్ళారు. అప్పుడు సునిత వాళ్ళ అమ్మ నాన్న తో ఇలా అన్నది. అమ్మ కులాలు మతాలు పాటించడం మంచిది కాదు, మనిషి మనిషికి సహాయ పడడం మానవత్వం మంచి లక్షణం అనివాళ్ళకి బుద్ధి చెప్పింది. అప్పటినుండి వారు కూడా అనిత సునిత లాగే అందర్నీ ప్రేమగా చూడడం మొదలుపెట్టారు ‌‌.
నీతి: కులమత బేధాలు లేకుండా మనుషులను ప్రేమించండి సుమా! ఎందుకంటే ఈ భూమిపై మనము ఎప్పటికీ ఉండిపోవడానికి రాలేదు ఉన్నన్ని రోజులు అందరితో కలివిడిగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను ‌.


కామెంట్‌లు