నిషిద్ధాక్షరి-సాహితీసింధు సరళగున్నాల

చ ,మ అక్షరాలను నిషేదిస్తూ చంపకమాలావృతంలో

కలతలురేపు దానవులు కాటికినంపగ నుండువారలున్
నల నిల నిల్వగా,హృదిన యాశలునన్నియునుడ్గువారలున్
నెలవుగనిండుదాష్టికపునీడలునెన్నడునుండనెప్పుడున్
తలపున వేదనల్విడిన ధన్యతనందును శాంతినిండునే

చ. మ..అక్షరాలను నిషేధిస్తూ కందంలో

పలుకుల శోభయునిండగ
నిలగుర్తుయెనిన్నునిలుపు నెలకోయిలగా
తళుకులనీనెడు వెలుగులు
కులుకులనందించు నెపుడు కుహుకుహులాడన్
కామెంట్‌లు