ప్రేమించాను!!?:-ప్రతాప్ కౌటిళ్యా ( కె ప్రతాప్ రెడ్డి)

భాషను
ఇంకా కనిపెట్టలేదు
అప్పుడు ప్రేమించాను
ఆమెను!?

మాట కనిపెట్ట బడలేదు
అక్షరం కనిపెట్టబడ లేదు
పాట కనిపెట్ట బడలేదు
అప్పుడు
ప్రేమించాను ఆమెను!?

జ్ఞానేంద్రియాలు
ఆమెను కనిపెట్టావీ
ఆమె ప్రేమను కని పెట్టాయి
అప్పుడు ప్రేమించాను
ఆమెను!!?

జ్ఞానం పుట్టలేదు
విచక్షణ జ్ఞానం ఇంకా పుట్టలేదు
అప్పుడు
ప్రేమించాను ఆమెను !?

అమ్మ ఒడిలో
ఆ బడిలో
ఆటకనిపెట్టబడింది
అప్పుడు ప్రేమించాను
ఆమెను !?

అంకితం ఆమెకు
Pratapkoutilya lecturer in Bio-Chem
8309529273,palem

కామెంట్‌లు