*బాలనరేంద్రుడు*(కథ)("రాజశ్రీ"కవితా ప్రక్రియలో)(మూడవభాగము):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 9)
అంతలోనె బండి దాటిపోయె
గండమంత పూర్తిగా గడిచిపోయె
మక్కువతో కొన్న బొమ్మ
అయ్యో ముక్కలాయె నమ్మ!
10)
బొమ్మ కొరకు రోడ్డుపైని
బాలుడపుడు చూచె కాని
ముక్కలైన శివుని బొమ్మ
వెక్కిరించిన చందమాయె నమ్మ!
11)
బొమ్మ పగిలి నందుకతడు
ఏమాత్రం ఏడ్వలేదు బుద్ధిమంతుడు
అమ్మ కొడుతుందేమో అని
భయము చెందలేదు కాని!
12)
అపాయము నుండి చెలుని
ఆదుకుంటి చాలు అని
సాగిపోయె ఇక మిత్రునితో
తన ఇంటికి సరదాతో!
(సశేషము)


కామెంట్‌లు