మీమాంస ....!! >డా.ఎ.వి.నరసింహారావు >హైదరాబాద్.*
ఇదేంటి ....
నన్ను నేను గుర్తించుకునే లోగానే,

కాలం మెల్లగా, నిశ్శబ్దంగా, 
అడుగులో అడుగు వేస్తూ 
నా అరవై వసంతాలు కబళించి 
చాప క్రింద నీరులా జారిపోయింది!

నా కష్టాలు, సుఖాలు -
నా గుండె చప్పుళ్లు ,
పట్టించుకోకుండా -
పరిగెత్తెతుందెందూకూ?

చిన్న నాటి జ్ఞాపకాలను 
ఆవిరి చేస్తూ ...
పై పైకి ఎగిరి పోతుంది 
కదిలిపోయిన కాలాన్ని
అనుభూతుల గీతాలుగా
పాడుకుందామనుకుంటే
అనుభవాల మరకలను 
చిత్రీకరిస్తుంది.....!

నన్ను నాతో  వేరు చేసి 
తనతో పరుగులెత్తిస్తుంది
కలవాలని ఆశపడితే, 
కలలా కరిగి పోతుంది!

స్వతంత్ర దేశంలో ఉన్నానన్న 
భ్రమలో ఉన్న నా స్వేచ్ఛను 
కబళించి ....

కాలచక్రపు ఆరు ఋతువుల 
మాలతో జత చేసింది....!
కనిపించినట్లు ఉంటుంది కాని 
కళ్ల ముందు నిలవదు ....
స్పర్శ కు అందదు ....
అయినా------
పరుగులు తీయిస్తోంది 
ఈక్షణం ...
గతమా?వర్తమానమా ?
ప్రతి నిముషం--
ఒక...మీమాంస ....!!


కామెంట్‌లు