కాశీపతి జ్ఞాన యజ్ఞం :-కంచనపల్లి వేంకట కృష్ణా రావు

 కాశీపతి మహాపండితుడు, ఎన్నో గ్రంథాలు రచించాడు. భారత ,  భాగ వతాలకు  వ్యాఖ్యానాలు వ్రాశాడు.కాశీపతి ఎంత పండితుడైనా ఆయనకు విషయ జ్ఞాన జిజ్ఞాస ఎక్కువ. ఎక్కడైనా కొత్త గ్రంథాలు కనబడితే సేకరించేవాడు. కొత్త కవి లేక గ్రంథకర్త తెరాస పడితే వారితోవిపులంగా చర్చించి , వారి వద్ద నేర్చుకో గలిగినంత నేర్చుకొనే వాడు.
        ఒకసారి కాశీ పతి తన శిష్యులతో వేరే ఊరికి ప్రయాణిస్తున్నాడు. మార్గ మధ్యంలో ఒక పల్లెటూరులో విశ్రాంతి కోసం ఆగారు. అప్పుడే అక్కడ కొందరు స్త్రీలు పల్లె పదాలు వారి యాసలో పాడసాగారు. ఆ పల్లె పదాలు ఎంతో విన సొంపుగా ఉన్నాయి. అదీగాక కొన్ని పండితుడైన కాశీ పతి కే అర్థం కాలేదు.
         అంతే కాశీ పతి ఆ స్త్రీలను కలసి ఓపికగా ఆ పాట అర్థం, అందులోని పదాలకు అర్థం తెలుసుకున్నాడు. ఓపికగా తాను తెచ్చుకున్న పుస్తకం లో ఆ పాటలు , వాటి అర్థాలు వ్రాసుకున్నాడు!
   కాశీ పతి చర్య చూసి శిష్యులు ఆశ్చర్య పోయారు!
     "మీరు పండితులు, సంస్కృతం, ప్రాకృతం మొదలైన భాషలలో తమరు దిట్ట, అయినా ఆ పల్లె పాటల మీద మీకు ఎందుకు అంత మక్కువ కలిగింది?" అని అడిగారు.
     కాశీ పతి చిరునవ్వు నవ్వి ఈ విధంగా చెప్పాడు.
    "మనం ఎంత పండితులమైనా మనమే గొప్పని, మాకే అన్నితెలుసు అనుకుని గర్వంతో ఉండ కూడదు. పండితులు కానీ వారిదగ్గర నుండి , చిన్న చిన్న పనులు చేసుకునే వారి దగ్గర కూడా వారు చెప్పెకథలలో, పడు
పడుకునే పాటల్లో ఎంతో సాహిత్యం ఉండవచ్చు. వాటిని కూడా పండితుడైన వాడు ఒడిసి పట్టుకోవాలి. వాటిమీద పరిశోధనలు  చెయ్యాలి. అప్పుడే అటువంటి గ్రంధస్తం కాని రచనలు, పాటలు బతికి పోతాయి. అటువంటి కళలు నశించవు. అందుకే ఆ పాటలు నన్ను ఆకర్షించాయి. ఆ పాటల్లోని పదాలు కొత్తగా కనబడ్డాయి. అందుకే వారి నుండి వాటిని గురించి తెలుసుకొని వ్రాసుకున్నాను.
ఇంకొక ముఖ్య విషయం వారు ప్రకృతి అందాలకు పరవశించి పాడిన పాటలు అవి. అవివారి హృదయాల నుండి వచ్చిన పాటలు!అవి స్వచ్ఛమైన పాటలు" అనిచెప్పాడు కాశీ పతి.
     గురువు గారి దూర దృష్టికి ఉన్నత ఆలోచనలకు శిష్యులు మనస్సులోనే ఆయనకు నమస్కారాలు అందించారు.
        ఆ తరువాత కాశీ పతి ఆ నగర రాజుఆనంద వర్మ వద్దకు వెళ్ళి తానుసేకరించిన పాటల్ని, పదాల పొందికను వివరించాడు. అంతరించిపోతున్న భాషల్ని కళల్ని కాపాడి భావి తరాలకు అందించాలని చెప్పాడు.
    అక్కడే ఉన్న మరో పండితుడు శ్రీకరుడు కాశీ పతి చెప్పిన
మాటలు విని అవహేళనగా " కాశీ పతి తమరు అంతపెద్ద పండితులు, పండితులు చడవగలిగిన ఎన్నోగ్రంధాలు వ్రాసారు. మరి అంతరించి పోయే కవిత్వ తత్వం లేని ఆ పల్లె పాటలు ఎందుకు? అవి భావితరాలకు అందించేంతవి కావే!" అని అన్నాడు.
   "శ్రీకరా, ఎంత పెద్దసంస్కృత గ్రంథం అయినా, ఎంత చిన్న పల్లె పాట అయినా ప్రజలకు జ్ఞాన జిజ్ఞాస ఉన్న వారికి ఎదో ఒకటి భోదిస్తూనే వుంటాయి. అదీగాక పల్లె పదాల్లో, పాటల్లో బాష సామెతలు వినసొంపుగా ఉండటమే కాకుండా జీవిత నగ్నసత్యాలు తెలుపుతూ  ఉంటాయి. వాటిలో పల్లె బాషా సౌందర్యం ఉంటుంది.అవి కాల గర్భంలో కలసిపోకుండా కాపాడవలసిన  బాధ్యత మన పండితుల మీద రాజు గారిమీద ఉంది. బాగా ఆలోచించు" అని వివరించాడు.
      కాశీ పతి  మాటలు శ్రీకరుడిలో ఆలోచనలు రేకెత్తించాయి!
      కాశీ పతి మాటలకు రాజూ గారు చప్పట్లు కొట్టి"కాశీ పతి నీవు చెప్పిన దాంట్లో ఎంతో నిజం ఉంది. ఈ  రోజే నిన్ను అటువంటి పల్లె పాటలు,కథలు, పల్లె పదాలు సేకరించే  బృందానికి మార్గదర్శకుడిగా నియమిస్తున్నాను. నీవు నీశిష్య బృందం,నీకు నచ్చిన కవిని తీసుకుని రాజ్యం లోని అన్ని పల్లెలు తిరిగి అక్కడి ప్రజలు చెప్పుకొనే కథలు , పాడుకునే పాటలు, పొడుపు కథలు , సామెతలు అన్ని సేకరించి గ్రంథస్తం చేయండి, ఆంతరించి పొయే ఆ కళా రూపాలను ఆదే మనంకలిగి చే శ్రీరామ రక్ష." అని చెప్పాడు.
    అక్కడ ఉన్న పండితులతో పాటు శ్రీకరుడు కూడ చప్పట్లు కొట్టి అటువంటి మంచి జ్ఞాన యజ్ఞం లో తానూ పాల్గొంటానని చేప్పాడు. రాజు గారితో సహా అందరూ సంతోషం వ్యక్తపరిచారు!

కామెంట్‌లు
Unknown చెప్పారు…
అన్నయ్య గారు పండితులు ఎవరు ఉన్నారు ప్రకృతికి విద్యార్దులే అని చక్కగా చెప్పారు 🙏❤️