*అక్షర మాల గేయాలు**సంయుక్తాక్షర గేయం చ- ఒత్తు*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 అర్చన అంగడికి వెళ్ళింది
పచ్చి మిర్చి చాలా తెచ్చింది
సువర్చల చేతికి సంచి ఇచ్చింది
మిర్చీ బజ్జీ చేయమని చెప్పింది
నూనె ఖర్చు కడుపు మంటని
కుర్చీలో కూర్చున్న బామ్మన్నది
లాల్చీ వేసుకుని వచ్చిన తాత
పల్చగా శెనగ పిండితో చేయగ
పాపాయి ఒకటి తీసుకుని తింది
కారం కారమనీ బాగా ఏడ్చింది

కామెంట్‌లు