'గురు బ్రహ్మ ' బిరుదు గద్వాల సోమన్నకు ప్రదానం


 పెద్దకడబూరు మండలం,హెచ్.మురవణి ఉన్నత పాఠశాలలో గణితోపా ధ్యాయుడుగా పనిచేస్తున్న బాలసాహిత్యవేత్త, కవిరత్న గద్వాల సోమన్న ను 'గురు బ్రహ్మ ' బిరుదు వరించింది.'డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ ' గారి జయంతిని పురస్కరించుకుని,గురుపూజోత్సవ వేడుకల్లో భాగస్వాములై,విద్యారంగంలో విద్యాభివృద్ధికి విశేష కృషి చేసి  సేవలందించినందుకు గాను ,తెలుగు భాషాభిమానాన్ని చాటుకున్న సహస్ర రత్న గద్వాల సోమన్న  సాహిత్య ప్రతిభను అభినందిస్తుతూ సాహితీ బృందావన  జాతీయ వేదిక వారిచే "గురు బ్రహ్మ" బిరుదు 5-సెప్టెంబర్-2021 నాడు వాట్సప్ వేదిక ద్వారా  ప్రదానం చేయడమైనది. పురస్కార గ్రహీత గద్వాల సోమన్న ను  సాహితీమిత్రులు, శ్రేయోభిలాషులందరూ అభినందించారు.


కామెంట్‌లు