గొడుగు కథనం:-- యామిజాల జగదీశ్

 ఫిబ్రవరి పద్నాలుగో తేదీ (ప్రేమికుల రోజు)....ఈ రోజు గురించి చెప్పవలసిన అవసరం లేదు. అందరికీ తెలిసినదే....అందుకు వెలువడే ప్రకటనలవల్ల విడిగా దాని గురించి చెప్పక్కర్లేదు. కానీ ఈ తేదీకి నాలుగు రోజుల ముందు అనగా ఫిబ్రవరి పదో తేదీకో ప్రత్యేకత ఉంది. అదేంటో చెప్పాలనిపించిం
ది.....
ఆ రోజు.....జాతీయ.గొడుగు దినోత్సవం!!
ఈ గొడుగుని ఒకానొకప్పుడు స్త్రీలకు సంబంధించిన వస్తువుగానే చూసారు.
వర్షాకాలంలో అవసరమై కొంత కాలం, తర్వాత ఎండా కాలంలో రక్షణ కోసం కొం
త కాలం ఉపయోగించే గొడుగుని చక్రవర్తుల గొప్పతనానికి చిహ్నంగానూ భావించిన రోజులున్నాయి. గోల్ఫ్ మైదానంలో ఓ ఆట వస్తువుగానూ, నాగరికతకు గుర్తుగానూ, పేదల చిహ్నంగానూ గొడుగును చెప్పుకున్న రోజులున్నాయి. కాలానికి తగినట్లు మారుతూ వస్తుంది గొడుగు వినియోగం.
బహుశా కృష్ణుడు పట్టుకున్న గోవర్థన గిరే ప్రపంచంలో మొట్టమొదటి గొడుగేమో...
అయితే చారిత్రకంగా దీని గురించి నమోదైనది క్రీస్తు పూర్వం నాలుగో శతాబ్దం.
రోమ్, గ్రీక్, ఈజిప్ట్, దక్షిణాసియా దేశాలతోపాటు భారత దేశంలోనూ గోడుగుని వర్షాకాలంలో వాడినట్టు చెప్పబడుతోంది.
3500 సంవత్సరాలకు పూర్వం ఈజిప్టులో పారసోల్ అనే మాటతో ఇది వాడుకలో ఉండేదని చరిత్ర పుటలు చెబుతున్నాయి. పారసోల్ అంటే ఎండలో ఉపయోగించిన గొడుగు అని అర్థం. అప్పట్లో ఈజిప్ట్ ప్రభువులు, థాజవంశీకులు, మత గురువులు ప్రత్యేకించి వీటిని ఉపయోగించే వారు. ఆ తర్వాత వర్షాకాలంలోనూ గొడుగు ఉపయోగం మొదలైంది. చైనీయులు గొడుగుని పదకొండో శతాబ్దంలో వర్షాకాలంలో ఉపయోగించడం మొదలుపెట్టారు. చైనాలోనూ మొదట్లో చక్రవర్తులే దీనిని వినియోగించేవారు. అయితే గొడుగులో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. ఉదాహరణకు, చైనా రాజుల గొడుగులో నాలుగే మడతలుండేవి. 
అదే సమయంలో గ్రీకు, రోమ్ నగరాలలో గొడుగులో కొద్ది మార్పులొచ్చాయి. మహిళల కోసం ప్రత్యేకించి గొడుగులు తయారుచేయడం మొదలుపెట్టారు. దాంతో మగవాళ్ళు గోడుగు తీసుకెళ్ళడం మానేశారట. 
కొందరు స్త్రీలు తమ పనిమనుషులచేత గొడుగు పట్టించుకుని నడిచేవారట. కానీ ఒక దశలో గొడుగుని ఉపయోగించడం మానేసారట. రోమ్ చక్రవర్తి ఓటమితో కనిపించకుండా పోయిన గొడుగులు కొంత కాలం తర్వాత గొడుగులు మళ్ళా పుట్టుకొచ్చాయి.
17 వ శతాబ్దంలో ఫ్రాన్స్, ఇటలీ, ఇంగ్లండ్, అమెరికాలలో గొడుగులను ఉపయోగించడం అధికమైంది. అయితే అప్పుడుకూడా స్త్రీల చేతివస్తువుగానే ఉంటూ వచ్చింది గొడుగు!
ఇంగ్లండులో ఓ ఆస్పత్రి స్థాపకుడు అయిన జోనాస్ హాన్వే తానెక్కడికి వెళ్ళినా గోడుగుని తీసుకుపోతుండేవాడు. 
1790 ప్రా రాంతంలో గొడుగు స్త్రీ, పురుషుడు అనే తేడా లేకుండా అందరూ ఉపయోగించడం మొదలుపెట్టారు.
మహాభారతంలో ఓ కథ ఉంది.
జమదగ్ని భార్య తన భర్త బాణాన్ని సంధిస్తే అది ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి దానిని తీసుకొచ్చేదట. ఇలా ఓరోజు ఆమె బాణం సేకరించి తీసుకురావడానికి చాలాసేపు పట్టింది. తన ఆలస్యానికి కారణం సూర్యుడని ఆమె కోపంతో చెప్పింది. ఆ మాట వినడంతోనే సూర్యుడు జమదగ్ని సూర్యుడిపైకి ఓ బాణం సంధించి గాయపరిచాడట. భయపడిన సూర్యుడు క్షమించమని ఆడగడంతోపాటు జమదగ్ని భార్య రేణుకకు ఓ గొడుగు ఇచ్చాడట.
 ఈ కథ ఎంత వరకు నిజమో తెలీదు. కానీ పదిహేడో శతాబ్దంలో వచ్చిన " Voyage to the East" పుస్తకంలో మొగల్ చక్రవర్తి సింహాసనానికి రెండు వైపులా గొడుగులు ఉండేవని ఓ వాక్యంబట్టి తెలిసింది. ఇప్పుడు మడత పెడుతున్న గొడుగులలాంటివి మొట్టమొదటగా 1710లో ఓ పారిస్ వ్యాపారి తయారుచేసాడు. అంతేకాదు, 1769 ప్రాంతంలో పారిస్ నగరంలో గొడుగులను అద్దెకు ఇచ్చేవారట. అప్పట్లో గొడుగు దొంగతనాలను నిరోధించడానికి పారిస్ లోని లెఫ్టినంట్ జనరల్ ఆఫ్ పోలీస్ అద్దెకిచ్చే గొడుగులు పచ్చరంగులోనే ఉండాలని ఆదేశాలు జారీ చేశాడు.
1902లో ది డైలీ మిర్రర్ The Daily Mirror అనే పత్రిక గొడుగుని ఓ ఆయుధంగా ఎలా ఉపయోగించాలోనని ఒక వ్యాసం ప్రచురించింది.
2005లో ఆఫ్రికాలో ఓ లెక్కలు అసిస్టెంట్ ప్రొఫెసరుని ఓ విద్యార్థి కొట్టి చంపడానికి గొడుగుని ఉపయోగించాడు.
వర్షాకాలంలో గొడుగుని తీసుకుపోవడం సర్వసహజమే. అయితే ఇంటికి తిరిగొస్తున్నప్పుడు గొడుగుని ఎక్కడ మరచిపోయి మాటలు పడటం మామూలే.
పెళ్ళితంతులో కాశీయాత్ర అనే ఘట్టంలో గొడుగుని ఉపయోగించడం తెలిసిందేగా.
 
 మన గొడుగు మరొకరి జీవితం ...అవును....గొడుగు రిపేర్ చేసే అతను వీధి వీధి తిరుగుతూ గొడుగు రిపేర్ చేస్తానంటూ అరుస్తుండటం చూసే ఉంటాం. కొన్ని చోట్ల రోడ్డు పక్కన ఓ మూల కూర్చుని గొడుగులు రిపేర్ చేసే శ్రామికుడిని చూడొచ్చు.
ఐకమత్యానికి గుర్తుగా ఓ అద్భుతమైన మాట ఉంది....
అందరం కలిసి ఓ గొడుగు కింద కలిసిమెలసి పని చేద్దామన్నదే ఆ మాట. ఇది చక్కటి మాటే కదా! కాదంటారా!! 

కామెంట్‌లు