మాధుర్యం అంటే?.--తాటి కోల పద్మావతి గుంటూరు.

 మాధుర్యం అనే మాటకు తీపు, సౌందర్యం, ఒకానొక కావ్య గుణం అనే అర్ధాలు ప్రధానంగా ఉన్నాయి. మాధుర్యం ఎన్నో విధాలు చెవులకు ఇంపు నింపి శబ్దాల వల్ల కలిగేది. ఉచ్చారణకు పనికి వచ్చే మాటల కూర్పు వల్ల కలిగేది. కన్నులకు కట్టే వర్ణనలు ఆశ్రయించేది. అర్థం లోని సోగసు వల్ల ఆలోచనకు హాయ్ నిచ్చేది. మాటలకు వదిగిరాని మాధుర్యం గలది.
మనం మధురమైన ఫలాలు ఎన్నో తింటూ ఉంటాం. ఒక్కొక్క దాని రుచి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఏది మరొక దానికి పోలిక కానేకాదు. వేయి సంవత్సరాలు పైబడింది మన తెలుగు సాహిత్యం. ఎందరో కవులు పుట్టినారు. ఎన్నో సాహిత్య ప్రక్రియలు అభివృద్ధి చెందిన వి. ఇవన్నీ నీ వాటి వాటి ప్రత్యేక విధానాల చేత మాధుర్యం సృష్టించినాయి.
మన మన తెలుగు కవులలో నన్నయ్య లో సూక్తి మాధుర్యం ఉంది. తిక్కన్న లో నాటకీయ సంభాషణ మాధుర్యం ఉంది. ఎర్రన్న లో వర్ణ మాధుర్యం ఉంది. నాచన సోముని లో నవీన గుణ మాధుర్యం ఉంది. శ్రీనాధుని లో చాటుపద్య మాధుర్యం ఉంది. పోతన్న లో మకరంద మాధుర్యం ఉంది. పెద్దన్న లో జిగిబిగి మాధుర్యం ఉంది. తిమ్మన్న లో ముద్దు పలుకు మాధుర్యం ఉంది. దూర్జటి లో అతులిత మహిమా మాధుర్యం ఉంది. భట్టుమూర్తి లో సంగీత మాధుర్యం ఉంది. చేమకూర వెంకట కవి లో పదబంధాల మాధుర్యం ఉంది. ఇవన్నీ నీ ఉన్నత స్థాయి సాహితీ పరిశీలింప వలసినవి. మాధుర్యం నిండిన మాటలు మహిమలు మాధుర్యాన్ని పంచి పెడతాయి. మాధుర్యం అంటే తెలుసుకోవడం మన కర్తవ్యం.
కామెంట్‌లు