*మాతాత*(బాలగేయం):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 బోడిగుండుతో మాతాత
చక్కనిపిలకతో మాతాత
బొక్కినోటితో మాతాత
బోసినవ్వుల మాతాత
చేతికర్రతో మాతాత
కిర్రుచెప్పులతో మాతాత
మెల్లగనడిచే మాతాత
నీతులుచెప్పే మాతాత
ప్రేమనుపంచే మాతాత!!

కామెంట్‌లు