పసి పిల్లలు (బాలగేయం):----గద్వాల సోమన్న
పసి పిల్లల మనసులు
సుతిమెత్తని తీగలు
పాలవెల్లి వెలుగులు
పాలకడలి తరగలు

ఒలుకుతాయి ప్రేమలు
ప్రవహించును మమతలు
గుబాళించు సుమములు
దైవంతో సమములు

పసి పిల్లలు తారలు
జీవనది ధారలు
భువిని కరుణామయులు
ముద్దుల చిన్నారులు

శుద్ధమైన హృదయులు
గుణంలోన మాన్యులు
శ్రేష్ఠమైన బుద్ధులు
పంచదార సుద్దులు

సదనములో బాలలు
ప్రకాశించు భానులు
సాటిలేని వీరులు
కన్నవారి ఆశలు

పిల్లలున్న కళకళ
పలుకులు బహు గలగల
తారల్లా మిలమిల
పసిడి వోలె తళతళ


కామెంట్‌లు