త్యాగమయి " అమ్మ ":--గద్వాల సోమన్న ,గణితోపాధ్యాయుడు.

అమ్మ ఉన్న ఇంటిలో
ఆనందము ఉబుకును
వెన్నెలమ్మ కాంతిలా
నలుదిశలా కురియును

అమ్మ చెప్పు మాటలో
ప్రేమ పూవు విరియును
భవిష్య వాణి మాదిరి
జీవితాలు దిద్దును

అమ్మ చూపు ప్రేమలో
త్యాగమెంతో ఉన్నది
ఆమె సేవ ముంగిట
ఆకాశమే చిన్నది

గృహం గుడిలో దేవత
పెద్దది ఆమె  బాధ్యత
అమ్మ ఉంటే దీవెన
కల్గించొద్దు  వేదన

కామెంట్‌లు